గాంధీభవన్ లో రసాభాసగా తెలంగాణ పీసీసీ సమావేశం
గాంధీభవన్ లో తెలంగాణ పీసీసీ సమావేశమైంది. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.
అయితే, సమావేశం జరుగుతున్న కొంతసేపటికి ఆహ్వాన జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు సీనియర్ నేతలు పొన్నాలను నిలదీశారు. తమను సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. దాంతో, సభ్యుల మధ్య తోపులాట జరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. మిగతా సభ్యులు ఎంత వారించినా వినలేదు.