కార్మిక సంఘాల ఏర్పాటును అడ్డుకుంటే చర్యలు: నాయిని
పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు ఉందని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కార్మిక సంఘాల ఏర్పాటును అడ్డుకునే యాజమాన్యాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. మంగళవారం కార్మిక సంఘాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులకు ఆయా యాజమాన్యాలు కనీస వేతనాలను అమలు చేయాలని సూచించారు. కార్మిక చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని నాయిని అన్నారు.