20 గంటల నుంచి ప్రయాణికుల పడిగాపులు... పైలట్లు లేరన్న ఎయిరిండియా
ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా... మెరుగైన సేవలతో అభివృద్ధి చెందాల్సింది పోయి... రోజురోజుకూ దిగజారుతోంది. నిన్న మధ్యాహ్నం 3.55కి ముంబై నుంచి దోహా వెళ్లాల్సిన విమానం ఇంతవరకు బయల్దేరనేలేదు. దీంతో, 69 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు గాస్తున్నారు. తొలుత పావుగంట ఆలస్యమని అధికారులు ప్రకటించారు. తర్వాత సాంకేతిక సమస్య తలెత్తిందని... మరో గంట సమయం పడుతుందని చెప్పారు. అనంతరం ఆదివారం ఉదయం 7 గంటలకు వెళుతుందని నిన్న రాత్రి 8 గంటలకు తెలిపారు. కానీ, ఇంతవరకు విమానం బయల్దేరలేదు. పైలట్లు లేకపోవడంతో విమానం కదలలేదు. వేరే ప్రైవేట్ విమానం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విన్నవించుకున్నా... ఎయిర్ ఇండియా సిబ్బంది వినిపించుకోలేదు.