సైబరాబాద్ పరిధిలో మూడు నెలల పాటు 144 సెక్షన్: సీవీ ఆనంద్
హైదరాబాదు శివారు సైబరాబాద్ పరిధిలో మూడు నెలల పాటు 144వ సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి సెప్టెంబర్ 10 సాయంత్రం వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఆ ప్రాంత పరిధిలో పరిస్థితులను సమీక్షించిన తర్వాత ప్రజల శాంతి, సామరస్యాల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.