అత్తవారింటి నుంచే రాజ్యసభకు నిర్మలా సీతారామన్!
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా వెళ్లేందుకు అవకాశం కల్పించవచ్చని బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఉభయసభల్లో సభ్యత్వం లేని నిర్మలా సీతారామన్ ను స్వతంత్ర హోదాతో మోడీ సత్కరించారు. ఇటీవల నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మరణించడంతో ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఎన్డీయే మిత్రపక్షం టీడీపీ విజయం సాధించినందున, ఈ సీటు నిర్మలా సీతారామన్ కు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
దీంతో నిర్మల ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్ మెట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. ఈమె విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ పరకాల ప్రభాకర్ భార్య. బాబు ప్రమాణస్వీకారోత్సవం తరువాత రాజ్యసభ స్ధానానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.