ఆర్థిక మంత్రి జైట్లీతో భేటీ అయిన చంద్రబాబు
కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. కొత్త రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉండటంతో... కేంద్రం నుంచి అన్ని రకాలుగా ఆర్థిక సాయం పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా లబ్ధి పొందే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.