టీటీడీలో ఇంత నిర్లక్ష్యమా?: ఎస్పీఎఫ్ పని తీరుపై ఆగ్రహం
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్పీఎఫ్ పని తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మూడు సార్లు, నిన్న మూడు సార్లు ఎక్సైజ్ శాఖ అధికారులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. కేవలం ఒకసారి మాత్రమే ఎస్పీఎఫ్ అధికారులు గుర్తించారు. దీంతో ఎస్పీఎఫ్ పనితీరుపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీఎఫ్ తీరు మారకుంటే ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని టీటీడీ హెచ్చరించింది.