జాతీయ స్థాయిలో తెలుగుదేశం ప్రముఖ పాత్ర పోషించింది: యనమల
జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని యనమల రామకృష్ణుడు అన్నారు. మహానాడులో యనమల మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అని చెప్పారు. ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం... ఇక జాతీయ పార్టీగా ముందుకు సాగుతుందన్నారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన తాము, నరేంద్ర మోడీ నాయకత్వంలో మంచి పనితీరుతో ముందుకు వెళతామని ఆయన అన్నారు. అవినీతిని నిర్మూలించాలని, పేదరికం లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని ఆయన చెప్పారు. దేశంలో బీజేపీ తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన పార్టీ టీడీపీయేనని యనమల తెలిపారు.