నవాజ్ షరీఫ్ కి మహ్మద్ రఫీ, లతామంగేష్కర్ అంటే ఇష్టం: షబానా అజ్మీ
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ దేశానికి వెళ్లిపోయినా ఆయన మిగిల్చిన అనుభూతులు మాత్రం మన సెలబ్రిటీలను వదలడం లేదు. ఢిల్లీలో ప్రముఖ పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ ఇచ్చిన విందులో ప్రముఖ నటి షబానా అజ్మీ నవాజ్ షరీఫ్ ను కలుసుకున్నారు. ఆ సందర్భంగా ఆయనతో ఆమె ముచ్చటించారని ట్విట్టర్లో తెలిపారు. తన తండ్రి కైఫీ అజ్మీని నవాజ్ షరీఫ్ అభిమానించే వారని చెప్పడం తనకు ఆనందం కలిగించిందని ఆమె పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖ గాయకులు మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ అంటే తనకు ఇష్టమని నవాజ్ షరీఫ్ తెలిపారని ఆమె పేర్కొన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని భారత్, పాక్ సంయుక్తంగా సినిమాలు నిర్మించే విషయంపై చర్చించానని ఆమె అన్నారు.