ఎమ్మెల్యే సున్నం రాజయ్య నిరాహార దీక్ష ప్రారంభం
ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య నిరవధిక నిరాహార దీక్ష ఈ రోజు ప్రారంభమైంది. పోలవరం ముంపు ప్రాంతాలను నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్ష చేపట్టారు.