విద్యుత్ ఉద్యోగులతో యాజమాన్యం చర్చలు
విద్యుత్ ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది. మరోపక్క ఉద్యోగుల సమ్మెతో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. అంతకు ముందు హైదరాబాదులోని విద్యుత్ సౌధ వద్ద ఇవాళ ఉదయం విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఐఆర్ చెల్లిస్తే సమ్మె విరమిస్తామని వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలు విద్యుత్ ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారు.