తెలుగు వారి భాషాభిమానానికి ఇందిరా గాంధీ ముచ్చటపడ్డారు: సీఎం కిరణ్
తెలుగు ప్రజల భాషాభిమానానికి శ్రీమతి ఇందిరాగాంధీ ముచ్చటపడ్డారని సీఎం కిరణ్ తెలిపారు. పార్లమెంటులో ఆమె కీలక ఉపన్యాసాన్ని ప్రస్తావించారు. ఎస్సార్సీ విడుదల చేస్తున్న సమయంలో దక్షిణాదిలో తన పర్యటన విశేషాలు ప్రస్తావిస్తూ, తెలుగు ప్రజల భాషాభిమానానికి ముగ్ధురాలినైపోయానన్నారు. కలిసి ఉండడంలో ఇబ్బందులు ఉన్నా తామంతా కలసి ఉంటామనడం తనను ఆకట్టుకుందని ఇందిరాగాంధీ తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ తన చెవుల్లో వారి సమైక్యతా రాగమే వినిపిస్తోందని పేర్కొన్నారని తెలిపారు. ఇది దేశానికి, తెలుగు ప్రజలకు మంచి చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారని సీఎం కిరణ్ వెల్లడించారు.