ఈవీవీ సోదరుడు, స్టిల్ ఫొటోగ్రాఫర్ గిరి మృతి
దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సోదరుడు ఈవీవీ గిరి(49) మరణించారు. కామెర్ల వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్ అయిన గిరి పలు తెలుగు చిత్రాలకు పని చేశారు.