ఫిబ్రవరిలో పాలమూరు జాతర
మహబూబ్ నగర్ జిల్లా విశిష్టత, సంస్కృతి ప్రతిబింబించే విధంగా పాలమూరు జాతర ఉత్సవాలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ గిరిజ శంకర్ చెప్పారు. ఈ జాతర ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు జరుగనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో రోజుకొక కార్యక్రమం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ జాతరలో ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పువ్వులు, పండ్ల ప్రదర్శనలు వుండాలని ఆయన అధికారులతో చెప్పారు.