కేటీఆర్ ప్రసంగం తీరుపై కాంగ్రెస్, టీడీపీ సభ్యుల అభ్యంతరం
శాసనసభలో బిల్లుపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రసంగించిన తీరుపై కాంగ్రెస్, టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కుట్ర పన్ని తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కలుపుకున్నారని అనడం సరికాదని మంత్రి మాణిక్య వరప్రసాద్ అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని కేటీఆర్ కించపరిచేలా మాట్లాడటం బాధ కలిగిస్తోందని మరో సభ్యుడు శేషారావు అన్నారు. మరోవైపు మంత్రి శైలజానాథ్ కూడా లేచి.. తన అభ్యంతరాన్ని తెలిపారు.