ప్రైవేటు బస్సు ప్రయాణం ప్రమాదకరం: ఆర్టీసీ కరపత్రాల ఉద్యమం
ఇదేంటి, ఎంతో సౌకర్యంగా గమ్య స్థానాలకు చేరుస్తోన్న ప్రైవేటు బస్సు ప్రయాణం గురించి ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా? అవును, మీరు చూసింది నిజమే..! మహబూబ్ నగర్ జిల్లా పాలెం దుర్ఘటన మరువక ముందే మరిన్ని ప్రైవేటు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరో ప్రక్క ఆర్టీఏ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ కార్యాలయాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బస్సు పర్మిట్లు, ఆయా ప్రైవేటు సంస్థలకు చెందిన బస్ సర్వీస్ వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల హైదరాబాదులోని అమీర్ పేటలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బుకింగ్ కౌంటర్లను కూడా ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన విషయం విదితమే.
విజయవాడ నగరంలో ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ కార్మికులు నడుం బిగించారు. ఇందులో భాగంగా, విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లలో ‘ప్రైవేటు బస్సు ప్రయాణం ప్రమాదకరం - ఆర్టీసీ ప్రయాణం సురక్షితం’ అంటూ ఆర్టీసీ సిబ్బంది ఇవాళ (సోమవారం) కరపత్రాలను పంచిపెట్టారు. ఈ కరపత్రంలో ఇటీవల జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాద ఘటనలను ఆర్టీసీ సిబ్బంది ఉటంకించారు.