భార్యను చంపి... గ్యాస్ బండ వెనుక దాచిన భర్త!
అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. భార్యను హతమార్చి.. గ్యాస్ బండ కింద దాచిన భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో కట్టెతో కొట్టి చంపి, గోనెసంచిలో చుట్టేసి.. గ్యాస్ బండ వెనుక దాచి ఉంచాడా కిరాతకుడు. అనంతరం ఆమె అత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసి.. చివరికి దొరికిపోయాడు.
ధర్మవరం జగ్జీవన్ రామ్ నగర్ కు చెందిన ప్రవల్లిక, రాజేష్ లు ప్రేమించుకొని, ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల నుంచి జగ్జీవన్ రామ్ నగర్ లోనే నివాసం ఉంటున్నారు. డ్రైవర్ గా పనిచేసే రాజేష్ విధులకు తరచూ గెర్హాజరవడంతో వారికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో పాటు భార్యపై అనుమానం పెంచుకున్న అతడు తరచూ ఆమెతో గొడవ పడేవాడు. చివరికి రాజేష్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నేరస్థుడిని అరెస్ట్ చేశారు.