వెనక్కి తగ్గేది లేదు... సత్తా ఉంది.. సవాలు విసురుతున్నా: బాబు
ప్రత్యర్థులు చేసిన ప్రతి ఆరోపణపైనా సమాధానం చెప్పితీరుతానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో పయ్యావుల కేశవ్ అభిప్రాయ వ్యక్తీకరణ సందర్భంగా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ అభిప్రాయం చంద్రబాబుతో చెప్పించాలన్న డిమాండ్ పై బాబు ఘాటుగా స్పందించారు.
హరీష్ రావు, శైలజానాథ్ మరికొందరు చేసిన ప్రతి ఆరోపణపైనా సమాధానం చెబుతానని అన్నారు. ఎన్టీఆర్ మరణంతో పాటు మరిన్ని అంశాలపై సమర్థవంతంగా, సమగ్రంగా వివరిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి ఏం చేశామో చెప్తామని, కాదని ఎవరైనా అనగలిగితే చర్చకు రావాలని సవాలు విసురుతున్నానని ఆయన అన్నారు.