నటి సుచిత్రాసేన్ ను పరామర్శించిన మమతా బెనర్జీ
తీవ్ర అనారోగ్యం కారణంగా కోల్ కతాలోని సిటీ నర్సింగ్ హోమ్ లో కొద్ది రోజుల నుంచి ప్రముఖ బెంగాలీ నటి సుచిత్రా సేన్ చికిత్స పొందుతున్నారు. నిన్న(ఆదివారం) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి సేన్ ను పలకరించారు. 25 నిమిషాల పాటు ఆమెతో పాటు మమతా ఉన్నారు. సేన్ ను కలవడం తన అదృష్టమని, మంచి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తానని, ఇవి చాలా ఉద్వేగ క్షణాలని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. బెంగాలీ సినిమాలో ఎంతో పేరుపొందిన సేన్ దాదాపు మూడు దశాబ్దాల నుంచి బయటకి రావడంలేదు. మరోవైపు వెంటిలేటర్ పై ఉన్న ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదకర స్థితి నుంచి బయటపడలేదని వైద్యులు తెలిపారు.