నేడు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భేటీ
ఢిల్లీలో పాగా వేసిన సామాన్యుడి పార్టీ.. ఇక దేశవ్యాప్తంగా పాతుకుపోయే దిశగా అడుగులు వేయనుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఒక వ్యూహాన్ని ఖరారు చేసే యోచనలో ఉంది. దీనికి సంబంధించి జాతీయ కార్యవర్గ సమావేశం నేడు ఢిల్లీలో జరుగుతోంది. ఇందులో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తామని పార్టీ సిద్ధాంతకర్త యోగేంద్రయాదవ్ తెలిపారు. అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలి, పార్టీ కేడర్ లో ఉన్న ఉత్సాహాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై కూడా సమాలోచనలు జరుపుతామని చెప్పారు.