పాలెం ఘటనపై స్పీకర్ కు నోటీసిచ్చిన టీడీపీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాలెం వోల్వో బస్సు ఘటనపై, స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు టీడీపీ ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీతాదయాకర్ రెడ్డి నోటీసు ఇచ్చారు. సభలో ఈ దుర్ఘటనపై లఘు చర్చ జరపాలని వారు స్పీకర్ కు విన్నవించారు. ఈ విషయంపై చర్చించి, బాధితులకు న్యాయం చేయడానికి అన్ని పార్టీలు కలసి రావాలని వారు కోరారు. పాలెం ఘటనపై చర్చకు తమ మద్దతు ఉంటుందని టీఆర్ఎస్ తెలిపింది.