మంత్రి గంటాకు త్వరలో షోకాజ్ నోటీసులు
కాంగ్రెస్ పార్టీపై బహిరంగంగా విరుచుకుపడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావుపై కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయిందని కామెంట్ చేస్తుండటం... విభజనపై అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని సైతం ధిక్కరిస్తుండటంతో గంటాకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో నోటీసులు జారీ కావచ్చని సమాచారం. అయితే, గంటా మంత్రి పదవిలో ఉన్నందున... షోకాజ్ నోటీసులను పీసీసీ ఇవ్వాలా? లేక ఏఐసీసీ ఇవ్వాలా? అనే విషయంపై ఈరోజు కానీ రేపు కానీ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.