ఇలావుంటే మీరు ప్రేమలో పడ్డట్టే...

03-01-2014 Fri 04:49
మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా... లేదా ఎవరి ప్రేమలోనైనా పడ్డారా... ఒకవేళ ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఎలా తెలుసుకోవడం అనుకుంటున్నారా... మీ శరీరం ఇలా వుంటే మాత్రం మీరు కచ్చితంగా ప్రేమలో పడ్డటే. ఎలాగంటే... మీకు ఉత్కంఠ, ఆందోళన వల్ల గుండెలో బరువుగా అనిపించినా, లేదా మీ శరీరమంతా ఆనందానుభూతి కలిగినా మీరు ప్రేమలో పడ్డట్టే. అంత కచ్చితంగా ఎలా చెప్పగలరు అనేది మీ సందేహమా... ఇదంతా పరిశోధకులు ప్రత్యేకంగా కొందరు వ్యక్తులపై అధ్యయనాన్ని నిర్వహించి మరీ ఈ విషయాలను కనుగొన్నారు.

ఫిన్లాండ్‌, స్వీడన్‌, తైవాన్‌కు చెందిన 700 మంది వ్యక్తులపై ఫిన్లాండ్‌లోని ఆల్టో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. మానసిక ఉద్వేగాలు శరీరాన్ని ఎలాంటి అనుభూతులకు గురిచేస్తాయన్న అంశంపై వీరు పరిశోధన చేశారు. కంప్యూటర్‌లో మానవ దేహాల చిత్రాలను చూపించి వారిలో ఉద్వేగాలను కలిగించారు. వీరిపై చిత్రాలను చూసినప్పుడు ప్రాథమిక ఉద్వేగాలన్నీ ఎక్కువగా గుండె కొట్టుకునే వేగం, శ్వాసపీల్చుకోవడంపైనే ఎక్కువగా ప్రభావం చూపినట్టు వీరి అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనలో ప్రేమ భావనలు మనలో సంతోషాన్నిస్తాయని పరిశోధకులు గుర్తించారు. దాదాపుగా అన్ని రకాల ఉద్వేగాల వల్ల ముఖ కండరాల్లో చైతన్యం, చర్మ ఉష్ణోగ్రతల్లో మార్పులు కూడా కలుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

శరీరం పైభాగంలో కోపం, ఆనందం వల్ల కలిగే భావనల ప్రభావం శరీరం దిగువ భాగంపై కూడా పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాకాకుండా వీటికి భిన్నంగా సంతోషకరమైన సందర్భాలకు సంబంధించిన అనుభూతి శరీరమంతటిపైనా ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more