న్యూ ఇయర్ కి ట్రాఫిక్ ఆంక్షలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ నగర కమీషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. రేపు రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ లపై వాహనాల రాకపోకలను నిషేధించారు. ఆ సమయంలో నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. రేపు సాయంత్రం నుంచి భారీ వాహనాలను నగరంలోకి అనుమతించరు.