కుప్పకూలిన సౌతాఫ్రికా టాపార్డర్
డర్బన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో రోజున భారత బౌలర్లు సఫారీ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. వికెట్ నష్టపోకుండా 82 పరుగులతో ఈ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు తడబడ్డారు. ఓపెనర్ స్మిత్ (47) జట్టు స్కోరు 103 పరుగులప్పుడు జడేజా బౌలింగ్ లో ధావన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఆమ్లా కేవలం మూడు పరుగులే చేసి షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ పీటర్సన్ (62) జడేజా బౌలింగ్ లో మురళీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం కలిస్, డీవిలియర్స్ ఆడుతున్నారు. దక్షిణాఫ్రికా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 123 పరుగులు.