జనతా దర్బార్ నిర్వహించిన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎల్లుండి (28న) ప్రమాణ స్వీకారం చేయనున్న ఏఏపీ అధినేత కేజ్రీవాల్ ఈ రోజు ఉదయం జనతా దర్బార్ నిర్వహించారు. ఢిల్లీ కోశాంబిలోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలకు తామిచ్చిన అన్ని హామీలను సకాలంలో నెరవేరుస్తామని తెలిపారు. అంతేకాకుండా, ప్రతి ఇంటికీ 700 లీటర్ల నీటిని సరఫరా చేయడానికి అవసరమైన నిధుల సమీకరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.