తెలంగాణ రావడం కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేదు: రేవంత్ రెడ్డి
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేయడం లేదని టీ-టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తెలంగాణను ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ పార్టీని కలుపుకొనేందుకు కాంగ్రెస్ ఎదురు చూస్తోందని రేవంత్ పేర్కొన్నారు. అందుకే సోనియా కూడా విభజన ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తున్నారని తెలిపారు. తెలంగాణ రావాలంటే కేసీఆర్ పార్టీని విలీనం చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. అయితే.. తెలంగాణ రావడం కేసీఆర్ కు ఇష్టం లేనట్లుగా ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ ను తెలంగాణ జాతిపిత అంటూ సంబోధించడం తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమేనని ఆయన చెప్పారు.