సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమైన రైల్వే ఉద్యోగులు
దక్షిణ మధ్య రైల్వేలో సమ్మె సైరన్ మోగనుంది. అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లకు సంబంధించి సమ్మె చేయాలా? వద్దా? అనే అంశంపై రైల్వే మజ్దూర్ యూనియన్ ఉద్యోగులకు ఓటింగ్ నిర్వహించింది. సమ్మె బ్యాలట్ ఫలితాలను రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్రావు ఇవాళ వెల్లడించారు. మొత్తం ఓటింగ్ లో 68,640 మంది ఉద్యోగులు పాల్గొన్నారని, వారిలో 68,190 మంది సమ్మెకు మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల 15, 16, 17 తేదీల్లో సమావేశమై సమ్మె తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.