ఈ నెల 26న కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
అవినీతిని ఊడ్చేస్తానంటూ చీపురు పట్టిన కేజ్రీవాల్ ఈ నెల 26న ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నారు. ఈ మేరకు ఏఏపీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలపడానికి ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కేజ్రీవాల్ కలవబోతున్నారు. అయితే ఎన్నో పోరాటాలకు నిలయమైన జంతర్ మంతర్ వద్ద ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించామని ఏఏపీ నేత సిసోడియా తెలిపారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఆయన అంగీకరిస్తే ఈ కార్యక్రమాన్ని జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తామని తెలిపారు.