ఆంధ్రా ఇంజినీర్ ను కిడ్నాప్ చేసిన బోడో మిలిటెంట్లు
అసోం రాష్ట్రంలోని చిరాన్ జిల్లాలో మన రాష్ట్రానికి చెందిన ఇంజినీర్ కిడ్నాప్ కు గురయ్యాడు. బొల్లినేని శీనయ్య అండ్ కంపెనీలో ప్రకాశం జిల్లాకు చెందిన అంకన్నరావు ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బోడో తీవ్రవాదులు అతన్ని కిడ్నాప్ చేశారు. కొన్ని నెలల క్రితం పైడిరాజు అనే ఇంజినీర్ ను కూడా బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేసి... తర్వాత వదిలిపెట్టారు.