మితాహారంతోనే చక్కటి ఆరోగ్యం

14-12-2013 Sat 05:58
మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. మితాహారం తీసుకుని, కష్టపడి పనిచేయమని. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మితాహారం మాట పక్కనపెడితే సమయానికి తినకుండా వేళమీరి తినడం, పైగా రెండు పూటలకు కలిపి ఒకేసారి లాగించేయడం, జంక్‌ఫుడ్‌ తినడం... ఇవన్నీ కూడా మనల్ని అనారోగ్యం వైపు నడిపిస్తున్నాయి. ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధన జరిపి చెబుతూనే ఉన్నారు. తాజాగా తక్కువ ఆహారం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.

రోజుకు మనకు 2,200 కేలరీల శక్తి సరిపోతుంది. ఈమేరకు శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటే మనకు సరిపోతుంది. అలాగే ఈ కేలరీలు ఖర్చయ్యేలా కూడా మనం కష్టపడాల్సి వస్తుంది. ఇంతకన్నా ఎక్కువ కేలరీలను ఆహారంలో తీసుకుంటే మాత్రం మనకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజుకు అవసరానికి మించిన కేలరీలను ఆహారంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ముప్పు 42 శాతం పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అలాగే రోజూ కొద్దిసేపు వ్యాయామం చేసేవారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు 31 శాతం దాకా తగ్గుతున్నట్టు కూడా ఈ అధ్యయనంలో తేలింది.

వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మనం రోజువారీ తీసుకునే ఆహారం ద్వారా లభించే కేలరీలకు, అవి ఖర్చు కావడానికీ, అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికీ మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే విషయంపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో నెలసరి నిలిచిపోయిన 84,225 మంది మహిళలను ఎంచుకుని పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా వారి బరువు, ఎత్తుల నిష్పత్తి వంటి వివిధ అంశాలను బేరీజు వేసి చూడగా అందులో శారీరక శ్రమ చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతున్నట్టు తేలింది. ఇలా వ్యాయామం అనగానే బోలెడంత దూరం పరుగెత్తాల్సిన అవసరం లేదని, కేవలం కొద్దిపాటి వ్యాయామం చేసినా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మాథ్యూ సోరెన్‌సెన్‌ చెబుతున్నారు.

వారానికి కనీసం మూడు గంటలపాటు నడవడం, నాలుగు గంటలపాటు తేలికైన తోటపని చేయడం లేదా ఆరు మైళ్ల వేగంతో గంటసేపు పరుగెత్తడం వంటివి చేసినా కూడా ఫలితం కనిపిస్తుందని మాథ్యూ చెబుతున్నారు. కాబట్టి ఆహారంలో కేలరీలను తీసుకోవడంపై అప్రమత్తంగా ఉండాలని, బరువును నియంత్రించుకోవడం, వ్యాయామం చేయడం వంటివన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని, ఇవన్నీ కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా తోడ్పడతాయని సోరెన్‌సెన్‌ చెబుతున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more