: సర్వర్‌గా యంత్రుడు
బార్‌లలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా చక్కగా వారు కోరిన మందును సర్వ్ చేయడానికి అనువుగా ఒక కొత్తరకం రోబోలను తయారుచేస్తున్నారు. ఈ రోబోగారికి తల ఉండదు. దాని స్థానంలో టాబ్లెట్ ఉంటుంది. ఉండేది ఒక్క చెయ్యే... అయితేనేం... చక్కగా అవతలివారు అడిగిన పనులను చేసిపెడుతుందట. ఇలాంటి ఒక కొత్తరకం రోబోను తయారుచేస్తున్నారు. అన్నట్టు ఈ రోబోగారిపేరు జేమ్స్. పేరు చాలా బాగుందికదూ... జేమ్స్‌గారి పనులు కూడా బాగానే ఉంటాయట.
మనుషుల అవసరాలను అర్ధం చేసుకుని స్వయం చాలితంగా చిన్న చిన్న పనులను చేసే రోబోలను అభివృద్ధి చేయడానికి ఐరోపా యూనియన్ నిధులతో శాస్త్రవేత్తలు జాయింట్ యాక్షన్ ఇన్ ఎంబాడీడ్ సిస్టమ్స్ (జేమ్స్) అనే పేరుతో ఒక ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రోబోలను అభివృద్ధి చేస్తున్నారు. మనుషులతో చక్కగా ప్రవర్తించగలిగేలా, వారు చెప్పిన పనులను చేయగలిగేలా తమ రోబోలుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోబోలు బార్‌లలో చక్కటి సర్వర్లుగా పనిచేసే విధంగా ప్రస్తుతానికి రూపొందిస్తున్నామని శాస్త్రవేత్తలు వివరించారు.