మోటోరోలా నుంచి చౌకైన స్మార్ట్ ఫోన్... ‘మోటో-సి’లో ఫీచర్స్ ఇవే

మోటొరోలా కంపెనీ తక్కువ ధరలో 4జీ ఎల్టీఈ స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్లో జూన్ 2న విడుదల చేసింది. మోటొరోలా నుంచి లోగడ వచ్చిన లోఎండ్ ఫోన్లతో పోలిస్తే మోటో-సిలో అన్ని ముఖ్య ఫీచర్లను అందించే ప్రయత్నం చేసిందనే చెప్పాలి.


ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ అయిన 7.0 నౌగత్ పై ఇది పనిచేస్తుంది. మొబైల్ పనితీరు మెరుగ్గా ఉండేందుకు, ఏకకాలంలో ఒకటికి మించిన యాప్స్ ను ఓపెన్ చేసినా పనితీరు స్లో అవకుండా ఉండేందుకు గాను 1.1 గిగాహెర్జ్ మీడియాటెక్ ఎంటీ6580ఎం 64బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ను ఇందులో అమర్చారు. డిజైన్ పరంగా మోటో ఈ సిరీస్ కు భిన్నంగా క్లాసిక్ లుక్ తో ఉంది.

5 అంగుళాల ఎడబ్ల్యూవీజీఏ స్క్రీన్ తో ఉండే ఫోన్ ముందు భాగంలో మోటో అన్న లోగో, వెనుక భాగం మధ్యలో ఎం గుర్తు ఉంటాయి. స్టారీ బ్లాక్, ఫైన్ గోల్డ్, మెటాలిక్ చెర్రీ కలర్స్ లో లభిస్తుంది. అయితే, ఈ కలర్స్ మార్పులు అన్నవి కేవలం బ్యాక్ ప్యానెల్ కు మాత్రమే. ముందు భాగంలో అన్నింటికీ ఒకటే కలర్ ఉంటుంది. 9ఎంఎం మందంతో ఉండే ఈ ఫోన్ ఎత్తు 145.5ఎంఎం, వెడల్పు 73.6ఎంఎంతో ఉంటుంది.

courtesy motorola.comఈ ఫోన్ ముందు భాగంలో 2 మెగాపిక్సల్స్ కెమెరాను అమర్చారు. సెల్ఫీలు స్పష్టంగా రావడానికి గాను ముందు భాగంలో ఓన్ లైట్ ఆప్షన్ ప్రవేశపెట్టారు. పిక్చర్ పర్ఫెక్ట్ సెల్ఫీలు వస్తాయని మోటొరోలా చెబుతోంది. వెనుక భాగంలో 5 మెగా పిక్సల్స్ కెమెరా, ఎల్ఈడీ ఆటో ఫ్లాష్ లైట్, డిజిటల్ జూమ్ తో వస్తుంది. 74 డిగ్రీల ఏరియాను కవర్ చేసేలా ఫిక్స్ డ్ ఫోకస్ లెన్స్ ను అమర్చారు. వీడియో 720 పిక్సల్ క్లారిటీతో షూట్ చేసుకోవచ్చు.

courtesy motorola.comమోటో ఈ సిరీస్ ఫోన్లకు నాన్ రిమూవబుల్ బ్యాటరీ కాగా, మోటో-సిలో మోటొరోలా ఆ తప్పును సరిదిద్దుకుంది. రిమూవబుల్ బ్యాటరీని ఏర్పాటు చేసింది. 2,350 మిల్లీ యాంపీ అవర్స్ సామర్థ్యం గల లిథియం పాలీమర్ బ్యాటరీ ఇది.

courtesy motorola.comరెండు సిమ్ లున్నాయి. రెండూ మైక్రో సిమ్ లే. జీఎస్ఎం సపోర్టెడ్. వీటిలో సిమ్ 1 4జీ ఎల్టీఈ. సిమ్ 1 నుంచి కాల్ చేస్తున్న సమయంలో ‘చేంజ్ సిమ్’ ఆప్షన్ ద్వారా ఆ కాల్ ను సిమ్ 2కు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సిమ్ 2 నుంచి సిమ్ 1కు కూడా ఇదే తీరులో కాల్ మార్చుకోవచ్చు. డయలింగ్ స్క్రీన్ పైనే ఆ ఆప్షన్ కనిపిస్తుంది.

ర్యామ్ 1జీబీ, అంతర్గతంగా 16జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంది. దీన్ని మైక్రో ఎస్డీ కార్డుతో 32జీబీ వరకూ విస్తరించుకోవచ్చు. బరువు 154 గ్రాములు ఉంటుంది. జీపీఎస్ ఆప్షన్ కూడా ఉంది. స్మార్ట్ ఫోన్లలో ఆకర్షణీయమైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్షన్ మాత్రం లేదు.

దేశవ్యాప్తంగా 100 పట్టణాల్లో జూన్ 2 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.5,999. ‘‘కొంత మంది స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు. దీన్ని ఓ పెద్ద అవకాశంగా భావిస్తున్నాం’’ అని మోటో-సి విడుదల సందర్భంగా కంపెనీ దేశీయ ఎండీ సుధిన్ మాథుర్ తెలిపారు.


More Articles