127 ఏళ్ల చరిత్రకు ముగింపు.. రెండుగా విడిపోయిన గోద్రేజ్ కంపెనీ
- కుటుంబ కంపెనీని పంచుకున్న అన్నదమ్ములు
- ఆది గోద్రేజ్, నదిర్ ల వాటాకింద గోద్రేజ్ ఇండస్ట్రీస్
- జంషెడ్ గోద్రేజ్, స్మితా గోద్రేజ్ లకు గోద్రేజ్ అండ్ బోయ్స్
తాళాలతో ప్రారంభించి గ్లోబల్ కంపెనీగా..
దేశానికి స్వాతంత్య్రం రాకముందే ప్రారంభమైన గోద్రేజ్ కంపెనీ తొలుత తాళాల అమ్మకం ద్వారా వ్యాపారం ప్రారంభించింది. 1897లో అర్దేశిర్ గోద్రేజ్ ఆయన సోదరుడు పిరోజ్ షా బుర్జోర్జీ గోద్రేజ్ లు కలిసి ప్రారంభించిన ఈ కంపెనీ ప్రస్తుతం భిన్న రంగాలకు విస్తరించి గ్లోబల్ కంపెనీగా మార్పు చెందింది. ఇంజనీరింగ్, పరికరాలు, భద్రతా పరిష్కారాలు, వ్యవసాయ ఉత్పత్తులు, రియల్ ఎస్టేట్ సహా గోద్రేజ్ గ్రూపు పలు రంగాలకు విస్తరించింది. ఇప్పటికీ చాలామందికి తాళం కొనాలంటే ముందు గుర్తొచ్చే పేరు గోద్రేజ్.. ఈ కంపెనీ బీరువాలకు ఆదరణ చాలా ఎక్కువ. కాగా, స్వతంత్ర భారతదేశం ఆర్థికంగా ఎదగడంలో గోద్రేజ్ పాత్ర కూడా ఉందని నాదిర్ గోద్రేజ్ చెప్పారు. విడిపోయినా కూడా గోద్రేజ్ వారసత్వం కొనసాగుతుందని, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సంస్థ తరఫున ఎల్లప్పుడూ కృషి చేస్తామని వివరించారు.