నారా లోకేశ్ మే డే శుభాకాంక్షలు
- శ్రామిక ప్రపంచానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
- అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా యువనేత
- రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పర్యటిస్తున్న లోకేశ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో యువనేత లోకేశ్ బిజీబిజీగా ప్రచారం చేస్తున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో లోకేశ్ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. యువతను సన్నద్ధం చేయడానికి సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువతతో ముఖాముఖీ చేపడుతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్న 20 లక్షల ఉద్యోగాల కల్పన, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి హామీలపై అవగాహన కల్పిస్తారు. టీడీపీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. లోకేశ్ యాత్ర మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరు లోక్ సభ నియోజకవర్గాల్లో సాగనుంది.