జగన్ కు నవ సందేహాలతో బహిరంగలేఖ రాసిన షర్మిల
- జగన్ కు తొమ్మిది ప్రశ్నలను సంధించిన షర్మిల
- నవ సందేహాలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్
- డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్న
ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది? ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఎందుకు నిరాకరించారు? స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేశారు? డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? అంటూ తన లేఖలో షర్మిల తొమ్మిది ప్రశ్నలను సంధించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ నవరత్నాల గురించి గర్వంగా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కు షర్మిల నవ సందేహాలను సంధించారు.