10-12 వేల లోపు బెస్ట్ 4G, VoLTE స్మార్ట్ ఫోన్లు ఇవిగో!

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. కెమెరా దగ్గరి నుంచి మెమరీ దాకా స్మార్ట్ ఫోన్ల సామర్థ్యం రోజు రోజుకూ పెరుగుతోంది. కానీ మన బడ్జెట్ లో ఏ ఫోన్ ను ఎంచుకోవాలనే దానిపై మాత్రం అందరికీ అవగాహన ఉండడం లేదు. ర్యామ్, మెమరీ వంటివి ఎక్కువగా ఉన్నాయంటూ మొబైల్స్ తయారీ కంపెనీలు గుప్పిస్తున్న ప్రకటనల్లో దేనిని పరిగణనలోకి తీసుకోవాలో తెలియడం లేదు. అసలు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు కేవలం ర్యామ్, మెమరీని మాత్రమే కాకుండా ప్రాసెసర్, డిస్ప్లే వంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మరి ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకుంటే మార్కెట్లో ప్రస్తుతం రూ.10,000-12,000 ధరలో లభ్యమవుతున్న బెస్ట్ 4G, VoLTE ఫోన్లు ఏమిటో చూద్దాం..


1. లీఎకో లీ2
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0) ఆపరేటింగ్ సిస్టం. 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ (1080x1920) డిస్ప్లే. 401 పీపీఐ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్, 16 మెగాపిక్సెల్ బ్యాక్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ కలర్ ఎల్ఈడీ ఫ్లాష్, 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 32 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, యూఎస్ బీ టైప్-సీ పోర్ట్, బ్లూటూత్, జీపీఎస్, ఓటీజీ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.11,999.

2. షియోమి రెడ్ మి నోట్ 4 (3జీబీ ర్యామ్)
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0.1) ఆపరేటింగ్ సిస్టం. 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ (1080x1920) డిస్ప్లే. 401 పీపీఐ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ కలర్ ఎల్ఈడీ ఫ్లాష్, 4100 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, 32 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్, జీపీఎస్, ఓటీజీ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.10,999.
- మొత్తం ఇవే ప్రత్యేకతలతో ర్యామ్ మాత్రం 2 జీబీ వెర్షన్ రెడ్ మి నోట్ 4 అందుబాటులో ఉంది. దాని ధర రూ.9,999.


3. లైఫ్ ఎఫ్1ఎస్
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0.1) ఆపరేటింగ్ సిస్టం. 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5.2 ఇంచ్ ఫుల్ హెచ్ డీ (1080x1920) డిస్ప్లే. 424 పీపీఐ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్, 16 మెగాపిక్సెల్ బ్యాక్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ కలర్ ఎల్ఈడీ ఫ్లాష్, 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, 32 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్, ఓటీజీ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.9,970.

4. కూల్ ప్యాడ్ నోట్ 5
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0.1) ఆపరేటింగ్ సిస్టం. 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 617 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ (1080x1920) డిస్ప్లే. 401 పీపీఐ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ కలర్ ఎల్ఈడీ ఫ్లాష్, 4010 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, క్విక్ చార్జింగ్, 32 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్, జీపీఎస్, కంపాస్, ఓటీజీ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.10,999.

5. లెనోవో K6 పవర్ (32 జీబీ)
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0.1). 1.4 గిగాహెడ్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ (1080x1920) డిస్ప్లే. 441 పీపీఐ రిజల్యూషన్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 4000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 32 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్, జీపీఎస్, కంపాస్, ఓటీజీ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.9,999.

6. షియోమి రెడ్ మి 3ఎస్ ప్రైమ్
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0). 1.4 గిగాహెడ్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5 ఇంచ్ హెచ్ డీ (720x1280) డిస్ప్లే. 294 పీపీఐ రిజల్యూషన్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 4100 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 32 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్, జీపీఎస్, కంపాస్, ఓటీజీ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.8,999.

7. యు యూనికార్న్
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ లాలిపప్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ (అప్ గ్రేడబుల్ టు మార్ష మెలో). 1.8 గిగాహెడ్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ MT6755 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ (1080x1920) డిస్ప్లే. 401 పీపీఐ రిజల్యూషన్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 4000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, 32 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్, జీపీఎస్, కంపాస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.9,900.

8. లైఫ్ ఎఫ్1
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0.1). 1.5 గిగాహెడ్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 617 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ (1080x1920) డిస్ప్లే. 401 పీపీఐ రిజల్యూషన్, 16 మెగాపిక్సెల్ బ్యాక్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 3200 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, 32 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్, కంపాస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.8,900.

9. స్వైప్ ఎలైట్ మ్యాక్స్
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0) ఆపరేటింగ్ సిస్టం. 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ (1080x1920) డిస్ప్లే. 401 పీపీఐ రిజల్యూషన్, డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, క్విక్ చార్జింగ్, 32 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్, జీపీఎస్, కంపాస్, ఓటీజీ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.10,999.

10. షియోమి రెడ్ మి 3ఎస్
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0). 1.4 గిగాహెడ్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5 ఇంచ్ హెచ్ డీ (720x1280) డిస్ప్లే. 294 పీపీఐ రిజల్యూషన్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 4100 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 32 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్, కంపాస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.6,999.

11. పానసోనిక్ ఎల్యుగా నోట్
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0) ఆపరేటింగ్ సిస్టం. 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ MT6753 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5.5 ఇంచ్ ఫుల్ హెచ్ డీ (1080x1920) డిస్ప్లే. 401 పీపీఐ రిజల్యూషన్, 16 మెగాపిక్సెల్ బ్యాక్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ట్రిపుల్ ఎల్ఈడీ ఫ్లాష్, 3000 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, 32 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్, కంపాస్, ఓటీజీ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.10,599.

12. కూల్ ప్యాడ్ నోట్ 3 ఎస్
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0). 1.4 గిగాహెడ్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 415 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5 ఇంచ్ హెచ్ డీ (720x1280) డిస్ప్లే. 267 పీపీఐ రిజల్యూషన్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2500 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, 16 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.9,999.

13. వీడియోకాన్ అల్ట్రా 50
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0) ఆపరేటింగ్ సిస్టం. 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ MT6735 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5 ఇంచ్ హెచ్ డీ (720x1280) డిస్ప్లే. 294 పీపీఐ రిజల్యూషన్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, 32 జీబీ మెమరీ, ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.8,999.

14. ఇన్ ఫోకస్ బింగో 50 ప్లస్
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0) ఆపరేటింగ్ సిస్టం. 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ MT6753 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5.5 ఇంచ్  హెచ్ డీ (720x1280) డిస్ప్లే. 267 పీపీఐ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2600 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, 16 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్, కంపాస్, ఓటీజీ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.10,599.

15. ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్
4జీ, VoLTE సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మెలో (6.0) ఆపరేటింగ్ సిస్టం. 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ MT6735 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, ఐపీఎస్ ఎల్సీడీ 5.5 ఇంచ్ హెచ్ డీ (720x1280) డిస్ప్లే. 267 పీపీఐ రిజల్యూషన్, 13 మెగాపిక్సెల్ బ్యాక్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2500 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, 16 జీబీ మెమరీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.7,699.

స్మార్ట్ ఫోన్లలో వివిధ స్పెసిఫికేషన్ల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి (కింది లింక్స్ క్లిక్ చేయండి)

స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో ఏది బెటరో తెలుసుకోవడం ఎలా?
మంచి బ్యాటరీ ఉంటేనే మొబైల్ సూపర్.. మరి ఏ బ్యాటరీ మంచిది?
‘స్మార్ట్’ వేగానికి ప్రాసెసరే కీలకం
ఫోన్ లో ఎంత ఎక్కువ రిజల్యూషన్ (PPI) ఉంటే అంత మంచిది!
మీ మొబైల్ ఫోన్ డిస్ప్లే ఏ టైప్.. ఏ తరహా డిస్ప్లేలు బెటర్?


More Articles