Anand Mahindra: పిల్ల‌ల‌కు ఇలాంటివే నేర్పించాలి.. ఆలోచింప‌జేస్తున్న ఆనంద్ మ‌హీంద్రా వీడియో!

Anand Mahindra Tweet on Little Girl who help man to Cross the Road

  • ఓ చిన్నారి సేవాగుణాన్ని తెలియ‌జేసే వీడియోను పంచుకున్న వ్యాపార‌వేత్త‌
  • ప్ర‌పంచ‌మంతా ఎందుకు ఇలా ఉండ‌లేక‌పోతోందంటున్న ఆనంద్ మ‌హీంద్రా 
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పారిశ్రామిక‌వేత్త పోస్ట్‌

ప్ర‌ముఖ వ్యాపారవేత్త ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. తన అభిప్రాయాలను, ఇతరులకు స్ఫూర్తినిచ్చే ఫొటోలు, వీడియోల‌ను ఆయ‌న సామాజిక మాధ్య‌మాల‌ ద్వారా అభిమానులతో పంచుకుంటారు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఆలోచింప‌జేసే సందేశాలను షేర్ చేస్తుంటారు. ఇదే కోవ‌లో తాజాగా ఆయ‌న సేవాగుణం గురించి ఓ వీడియోను పంచుకోగా అది కాస్తా నెట్టింట వైర‌ల్‌గా మారింది. వీడియోకు "ప్ర‌పంచ‌మంతా ఎందుకు ఇలా ఉండ‌లేక‌పోతోంది" అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. 

ఇంత‌కీ వీడియోలో ఏముందంటే..!
చ‌క్రాల కుర్చీలో ఉన్న ఓ దివ్యాంగుడికి రోడ్డు దాటేందుకు ఓ చిన్నారి సాయం చేయ‌డం వీడియోలో చూడొచ్చు. దానికి స‌హ‌క‌రించిన వాహ‌న‌దారుల‌కు ఆ బాలిక కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డం కూడా వీడియోలో ఉంది. 'ఎక్స్' (ట్విట‌ర్‌) వేదిక‌గా ఆనంద్ మ‌హీంద్రా పంచుకున్న ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు పిల్ల‌ల‌కు ఇలాంటి విలువ‌ల‌ను నేర్పించాల‌ని కామెంట్లు చేస్తున్నారు.

Anand Mahindra
Twitter
Social Media
  • Loading...

More Telugu News