‘రాకాస’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో!

‘రాకాస’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో!

హైదరాబాద్, 23 జూలై 2026: బుల్లితెర ప్రేక్షకులకు సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో బ్లాక్బస్టర్ సినిమాతో రాబోతోంది. థియేటర్ వేదికగా ఘనవిజయం అందుకున్న కామెడీ హారర్ ‘రాకాస’ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేయనుంది. సంగీత్ శోభన్నయన్ సారిక జంటగా నటించిన ‘రాకాస’ ఈ ఆదివారం, జూలై 26, సాయంత్రం 6 గంటలకుమీ జీ తెలుగులో!

కొన్ని వేల సంవత్సరాల క్రితం రాకవర అనే కుగ్రామం, శాపానికి గురవుతుంది. అందువల్ల, ఆ గ్రామ ప్రజలు ఊరిలోని ఒక కోటలో ఉన్న బ్రహ్మ రాక్షసుడికి కొన్ని సంకేతాల రీత్యా ఒక ప్రాణాన్ని బలిగా పంపుతూ వస్తారు. అసలు యూఎస్ నుంచి అప్పుడే ఊరిలోకి వచ్చిన వీరబాబు (సంగీత్ శోభన్) బలి ఉచ్చులో ఎలా ఇరుక్కున్నాడుఅసలా రాక్షసుడు ఎలా వచ్చాడుచివరికి ఈ సమస్య ఎలా పరిష్కారం అయ్యిందిఅనే విషయాలు తెలియాలి అంటే జీ తెలుగు వేదికగా ఈ సినిమా చూసేయాల్సిందే.

మానస శర్మ దర్శకత్వంలోనిహారిక కొణిదెలఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మాతలుగా రూపొందిన ‘రాకాస’లో సంగీత్ శోభన్నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్బ్రహ్మాజీతనికెళ్ళ భరణిగెటప్ శ్రీను తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఆకట్టుకునే స్క్రీన్ప్లేకథకథనంఅద్భుతమైన సాంకేతిక అంశాలతో ‘రాకాస’ బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఒక ఉత్కంఠభరితమైన సినిమా అనుభవాన్ని అందించనుంది.

కామెడీ హారర్ ‘రాకాస’.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకుమీ జీ తెలుగులోతప్పక చూడండి!

Zee Telugu
Televesion

Watch Today's Deals on Amazon

More Press News