'నారీ నారీ నారీ నడుమ మురారి' విజయం తరువాత హీరో శర్వానంద్ నటించిన చిత్రం 'బైకర్'. తొలి భారతీయ మోటో రేసింగ్ చిత్రంగా, బైక్ రేసింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రచార చిత్రాలతో అందర్ని ఆకట్టుకోవడంతో పాటు శర్వానంద్ లుక్ కూడా ఈచిత్రంలో వైవిధ్యంగా కనిపించడంతో సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? అసలు బైకర్ కథేమిటి? రివ్యూలో తెలుసుకుందాం.
విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్, (శర్వానంద్) తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) దగ్గరే మోటో రేసింగ్ బైకర్‌గా శిక్షణ పొంది అంతర్జాతీయ బైక్ రేసర్‌గా రాణించాలని ప్రయత్నిస్తుంటాడు. సునీల్ నారాయణ్ క్రికెట్‌తో సమానంగా ఇండియాలో మోటో రేసింగ్ స్పోర్ట్ష్కు గుర్తింపు తేవాలని కలలు కంటాడు. అందుకే కొడుకు విక్కీని గొప్ప బైక్ రేసర్‌గా తీర్చిదిద్దటానికి ట్రైనింగ్ ఇస్తుంటాడు. విక్కీ, తండ్రి డ్రీమ్ నెరవేర్చేందుకు అంతర్జాతీయ రేసింగ్‌లో పాల్గొంటాడు.
అయితే ఈ పోటీలో ప్రత్యర్థి అన్వర్ వేసిన పన్నాగంతో విక్కీ మూడో స్థానంలో నిలుస్తాడు. ఈ రేసింగ్ తరువాత విక్కీ కొన్ని కారణాల వల్ల రేసింగ్‌కి, తండ్రికి దూరం కావాల్సి వస్తుంది. విక్కీ జీవితంలోకి వచ్చిన అనన్య వల్ల ఆయన లైఫ్‌లో వచ్చిన మార్పులేమిటి? కొంత విరామం తరువాత మళ్లీ విక్కీ రేసింగ్‌లో ఎందుకు పాల్గొన్నాడు? ఇందుకు కారణాలేమిటి? రేసింగ్‌లో ఇండియా తరపున విక్కీ విజయం సాధించి తండ్రి ఆశయాన్ని నేరవేర్చాడా? లేదా? తండ్రి, కొడుకుల మధ్య అసలు జరిగిందేమిటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరికి పరిచయం లేని బైక్ రేసింగ్ నేపథ్యంలో మోటో రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ నేపథ్యానికి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. అయితే ఇప్పటి వరకు తెలుగు తెరపై వచ్చిన స్పోర్ట్స్ డ్రామాల కథల తరహాలోనే ఈ కథ కూడా ఉంటుంది. కథ, కథనాల్లో ఎలాంటి కొత్తదనం ఉండదు. కథలో ఎలాంటి కీలక మలుపులు కూడా దర్శకుడు ఈ కథలో జోడించలేదు. ఊహకు అందే కథ, సన్నివేశాలతో సినిమా ఆద్యంతం తెలిసిన కథలానే కొనసాగుతుంది. దీనికి తోడు సినిమాలో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పూర్తిస్థాయిలో పండించడంలో దర్శకుడు తడబడ్డాడు. కథ, ఎమోషన్స్ కంటే కథ నేపథ్యానికి కీలకంగా నిలిచే రేసింగ్ సన్నివేశాలపైనే దర్శకుడు దృష్టి పెట్టాడు. ఈ విషయంలో మాత్రం ఆయన సఫలీకృతుడయ్యాడు.
ఎందుకంటే సినిమాకు మోటో రేసింగ్ నేపథ్యం కొత్తదనంతో పాటు సినిమా చూస్తే ఆడియన్స్‌ను థ్రిల్లింగ్‌ను కలిగిస్తుంది. రేసింగ్ సన్నివేశాలను విజువల్‌గా హైస్టాండర్డ్‌లో కనిపించాయి. ఈ సన్నివేశాల్లో ప్రేక్షకులు కూడా లీనమయ్యే విధంగా దర్శకుడు తెరపైకి తీసుకొచ్చాడు. ముఖ్యంగా అత్యంత క్లిష్టమైన రేసింగ్ సన్నివేశాలను ఎంతో ఉన్నత స్థాయిలో చిత్రీకరించారు. ఇక్కడే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ తన ప్రతిభను చూపారు. ఫస్టాఫ్ కాస్త స్లోగా స్పీడ్ తగ్గినట్లుగా అనిపించినా.. సెకండాఫ్‌ను దర్శకుడు తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. ముఖ్యంగా ఈ సినిమాకు సెకండాఫే కీలకం. ఇక్కడ ఏ మాత్రం దర్శకుడు సన్నివేశాల రూపకల్పనలో నిర్లక్ష్యంగా ఉన్నా సినిమా ఆద్యంతం డాక్యుమెంటరీ ఫీల్‌ను కలిగించేది.
అయితే తొలిసగంతో కంపేర్ చేస్తే మలిసగంలో సినిమా స్పీడ్‌ను, కొన్నిబలమైన ఎమోషన్ సన్నివేశాలను జనరంజకంగా తీర్చిదిద్దడం, పతాక సన్నివేశాలను కన్వీన్సింగ్‌గా ప్రజెంట్ చేయడంతో ఓవరాల్‌గా ఓ రిఫ్రెషింగ్ స్టోరీతో సినిమా చూశామన్న అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. అయితే దర్శకుడు ఒక్కోసారి సినిమా కథకు బ్రేక్ వేసి, బైక్‌ను మాత్రం రేసింగ్ ట్రాక్‌పై తిప్పుతున్నాడా? అనే ఫీల్ కలిగే విధంగా కథ ముందుకు కదలదు. మలేషియా రేస్ ట్రాక్‌పై జరిగే బైక్ రేసింగ్, జర్మనీలో సాగే రేసింగ్ సీన్స్ ఈ లోపాలను అధిగమించేలా చేశాయి. అయితే కథలో ఎమోషన్ సన్నివేశాలపై శ్రద్ద పెట్టి, వాటిని హార్ట్టచ్చింగ్గా తెరకెక్కించి ఉంటే ఈ బైకర్ రైడ్ హ్యపీ జర్నిలా ఉండేది. ఓవరాల్‌గా రేసింగ్ అనే కొత్త నేపథ్యంతో దర్శకుడు నిజాయితీగా చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం.
ఈ సినిమాలో హీరో శర్వానంద్ లుక్, గెటప్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. క్యారెక్టర్ తగిన విధంగా స్పోర్ట్స్ పర్సన్‌గా ఆయన బాడీని మార్చుకున్న విధానం సినిమా పట్ల శర్వానంద్‌కు ఉన్న తపనను తెలియజేస్తుంది. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో శర్వానంద్ నటన ఆర్గానిక్‌గా అనిపించింది. సునీల్ నారాయణ పాత్రలో రాజశేఖర్ ఆకట్టుకున్నారు. కోచ్ పాత్రలో రాజశేఖర్ కొత్తగా ఉన్నారు.
మాళవిక పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. శర్వానంద్, మాళవిక పెయిర్ చూడముచ్చటగా ఉంది. అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ, తులసి తదితరుల క్యారెక్టర్స్ అలరిస్తాయి. టెక్నికల్‌గా కూడా ఈ చిత్రం హై స్టాండర్స్‌లో ఉంది. ముఖ్యంగా యువరాజ్ ఫోటోగ్రఫీతో సినిమా ఎంతో కలర్ఫుల్గా కనిపించింది. రేసింగ్ సన్నివేశాల్లో ఆయన ప్రతిభ గురించి సినిమా చూసిన అందరూ మాట్లాడుకునే విధంగా ఉంటాయి. గిబ్రాన్ నేపథ్య సంగీతం కథ మూడ్‌ను క్యారీ చేసింది. దర్శకుడు అభిలాష్ రెడ్డి తను అనుకున్న కథను నిజాయితీగా తెరకెక్కించాడు. ఆయన రాసిన సంభాషణలు కూడా అలరిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మోటో రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కొత్త నేపథ్య కథలను, స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులను అలరిస్తుంది. థ్రిల్ల్‌ను పంచుతుంది.
'బైకర్' మూవీ రివ్యూ
Biker Review
Movie Details
Movie Name: Biker
Release Date: 2026-04-03
Cast: Sharwanand, Malvika Nair, Rajasekhar, Brahmaji, Atul Kulkarni, etc.
Director: Abhilash Reddy Kankara
Music: Ghibran
Banner: UV Creations
Review By: Maduri Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer