ఈ మధ్య కాలంలో టీజర్‌తో హాట్‌టాపిక్‌గా మారిన చిత్రం 'హుషార్ పిట్టలు'. టీజర్లో ఉన్న బోల్డ్ కంటెంట్ యువతను ఆకట్టుకుంది. దీంతో పాటు పాటలు, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమా చూడాలన్న ఆసక్తి యూత్‌లో కలిగింది. నూతన తారాగణంతో, బిక్షు అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది? యూత్‌ను అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయా? ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి అనుభూతిని అందించింది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
రవి (అన్ష్) టెన్త్‌లో టాపర్. స్కూల్లో ఫస్ట్. చదువు అంటే ఎంతో ఇష్టం. ఇలాంటి కుర్రాడిని ఆ ఊరిలో ఉండే ఆకతాయి బాలు గ్యాంగ్ మొబైల్లో అశ్లీల వీడియోలు చూపించి అతని దృష్టిని చెడు వైపు మళ్లీస్తారు. దీంతో చదువు మీద ఆసక్తిని పక్కకు పెట్టేసి అమ్మాయిలపై దృష్టి పెడతాడు. ఆ సమయంలోనే ఆ ఊరిలో ఉండే చిట్టి (వాసవి గణేషన్) రవిని చూసి ఆకర్షణలో పడిపోతుంది. అప్పటికే ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఆకర్షణ ఉండటంతో, పరిపక్వత లేని వయసులోనే ఇద్దరు హద్దులు దాటేస్తారు. కొన్ని రోజులు వీళ్లు ఎవరికి తెలియకుండా ఇలాగే కలుస్తుంటారు.
ఒక రోజు అనుకోకుండా ఇద్దరూ ఒకే గదిలో ఉన్న సమయంలో తల్లిదండ్రులకు దొరికిపోతారు. ఇక ఆ సిట్యుయేషన్లో తమ పిల్లలను చూసిన పేరెంట్స్ ఎలాంటి క్షోభను అనుభవించారు? పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? రవి, చిట్టిల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేమిటి? ఈ జంట తమ ప్రేమను గెలిపించుకున్నారా? చిన్న వయసులో ఆకర్షణకు లోనై వాళ్లు చేసిన తప్పుల వల్ల వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది మిగతా కథ.
యూత్‌ను లక్ష్యంగా బోల్డ్ కంటెంట్‌కు ఎంటర్టైన్మెంట్తో పాటు సందేశాన్ని జోడించి దర్శకుడు ఈ కథను తయారుచేసుకున్నాడు. టీజర్, ట్రైలర్లు కూడా బోల్డ్‌గానే ఉండటంతో ఈ సినిమాపై యూత్‌కు ఓ అంచనాకు వచ్చేశారు. ఫస్ట్‌హాఫ్‌లో రెండు ఆకట్టుకునే పాటలు, బోల్డ్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్తో యూత్ కావాల్సిన అంశాలు పుష్కలంగా నింపేశాడు. దర్శకుడు ఫస్ట్‌హాఫ్‌లో బోల్డ్ కంటెంట్‌ను ఎంత శ్రద్ధగా రాసుకున్నాడో.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా అంతకు మించి బలమైన భావోద్వేగాలను రెడీ చేసుకుని హృదయాలకు హత్తుకునే విధంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఉన్న సందేశాన్ని కన్వీన్సింగ్ చెప్పడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు.
హీరో, హీరోయిన్ల పరిచయం, వారి మధ్య వచ్చే సన్నివేశాలు, బాలు గ్యాంగ్‌తో హీరో జరిపే సంభాషణలు, శైలు అక్కతో హీరోయిన్ చేసే సాహసాలు ఇవన్నీ ప్రేక్షకులు వినోదంతో పాటు థ్రిల్ల్‌ను పంచుతాయి. ఇక రవి, చిట్టిల రహస్య కలయిక బయటపడిన తరువాత ద్వితీయార్థాన్ని దర్శకుడు ఎలా డీల్ చేస్తాడో అనే సందేహం అందరిలో కలుగుతుంది. అయితే సెకండాఫ్‌లో బలమైన ఎమోషన్ రెడీ చేసుకుని, రవి, చిట్టిలు ఇలా తప్పటడుగులు వేయడానికి కారణాన్ని చెప్పడంలో, ఆ రీజన్స్ కరెక్టేనని ఆడియన్స్ భావించే విధంగా దర్శకుడు డీల్ చేశాడు. చిన్నప్పటి నుంచే సెల్‌ఫోన్‌కు ఎడిక్ట్ అవ్వడం, తప్పుడు స్నేహాలు, వాళ్ల పిల్లలు ఎలాంటి తప్పుదారుల్లో నడిచే అవకాశం ఉందో చెప్పి అందర్ని ఆలోచింపజేశారు.
పిల్లలు తప్పుదారిలో నడవడం వల్ల తల్లిదండ్రులు ఎలాంటి క్షోభ అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని కొన్ని సన్నివేశాల్లో ఆవిష్కరించారు. పతాక సన్నివేశాలు ఎంతో భావోద్వేగభరితంగా ఉంటాయి. ఓవరాల్‌గా దర్శకుడు ఓ సక్సెస్ కోసం అన్ని ప్యారామీటర్లో సరైన కొలతలతో ఎంతో తెలివిగా ఈ చిత్రాన్ని రూపొందించాడనే భావన కలుగుతుంది.
మాసినపల్లి రవి పాత్రలో అన్ష్, చిట్టి పాత్రలో వాసవి గణేషన్ ఎంతో సహజంగా నటించారు. ఇద్దరి పెయిర్ కూడా బాగుంది. కొత్తవారైనా రొమాంటిక్ సన్నివేశాల్లో, ఎమోషన్ సీన్స్‌ల్లో కూడా ఎలాంటి తడబాటు లేకుండా పర్ఫార్మ్ చేశారు. చిట్టి పాత్ర ఎంతో క్యూట్‌గా అనిపించింది. ముఖ్యంగా ఈ రెండు పాత్రలు యువతను బాగా అలరిస్తాయి. హీరోయిన్ తండ్రి పాత్రలో గోవర్థన్, హీరో తండ్రి రమేష్‌లు ఆ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా ఫ్రెండ్స్ గ్యాంగ్ కావాల్సినంత వినోదాన్ని అందించారు. తొలి చిత్రమైనా దర్శకుడు ఎంతో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా ఈ కథను డీల్ చేశాడు. చిన్ని చరణ్ పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్. డీవోపీ రుద్రసాయి విజువల్స్ కూడా ఎంతో నేచురల్‌గా ఓ గ్రామీణ వాతావరణాన్ని ఆహ్లాదంగా చూపించాయి.
యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కించిన 'హుషార్ పిట్టలు' చిత్రంలో యువతరానికి నచ్చే అంశాలతో పాటు పరిణతి లేని ఆకర్షణ, ప్రేమల వల్ల జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. తప్పకుండా యువతరానికి నచ్చే సినిమా 'హుషార్ పిట్టలు'
'హుషార్ పిట్టలు' మూవీ రివ్యూ
Husharu pittalu Review
Movie Details
Movie Name: Husharu pittalu
Release Date: 2026-08-15
Cast: Vasavi Ganesan, Anshu
Director: Bikshu
Music: Charan Arjun
Banner: Rudra Kranthi Pictures
Review By: Maduri Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer