బంగారంపై ఇన్వెస్టర్ల ఫోకస్.. ఏడాదిలో 164 శాతం పెరిగిన పెట్టుబడులు!
- గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఏడాదిలో 164 శాతం పెరిగిన ఇన్వెస్ట్మెంట్లు
- ఆగస్టుకు రూ.1.91 లక్షల కోట్లకు చేరిన ఫండ్లలోని ఆస్తుల విలువ
- వెండి ఈటీఎఫ్‌లలోనూ రూ.86 వేల కోట్ల వరకు పెట్టుబడులు
- భారత్‌లో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లలో పెరుగుతున్న ఇన్వెస్ట్మెంట్లు
- యువత ప్రయాణాలు, వినోదం వంటి వాటిపై ఖర్చే చేస్తున్నారన్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రతినిధి
భారత్‌లో బంగారం పెట్టుబడులకు భారీగా ఆదరణ పెరుగుతోంది. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో పెట్టుబడులు ఏడాది వ్యవధిలో ఏకంగా 164 శాతం పెరిగాయి. 2026 ఆగస్టు నాటికి ఈ ఫండ్లలోని ఆస్తుల విలువ రూ.1.91 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ మొత్తం సుమారు రూ.72,500 కోట్లుగా ఉంది. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారాన్ని కేవలం ఆర్థిక అనిశ్చితి సమయంలో భద్రత ఇచ్చే సాధనంగానే కాకుండా.. పెట్టుబడుల డైవర్సికేషన్లో భాగంగా కూడా ఉపయోగిస్తున్నారు. వెండి ఈటీఎఫ్‌లలోనూ ఆగస్టు నాటికి రూ.85 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్ల వరకు పెట్టుబడులు ఉన్నాయి. బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెరుగుతుండటంతో పాటు, పారిశ్రామిక లోహాల మార్కెట్ కూడా విస్తరిస్తోంది.
రాగి, అల్యూమినియం, జింక్ వంటి లోహాలకు నిర్మాణ రంగం, తయారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు విద్యుత్ వినియోగం పెరగడం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌లు, సాంకేతిక మౌలిక సదుపాయాల విస్తరణతో వీటికి మరింత డిమాండ్ ఏర్పడుతోంది.
మరోవైపు భారత్‌లో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లలో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. 2026 ఆగస్టు నాటికి వీటి ఆస్తుల విలువ రూ.2.07 లక్షల కోట్లను దాటింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 57 శాతం వృద్ధి నమోదైంది. ఈ విభాగంలో వరుసగా 60 నెలల పాటు పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రతినిధి షీలా కులకర్ణి మాట్లాడుతూ, బంగారం డిమాండ్ స్వరూపం మారుతోందని తెలిపారు. యువత తక్కువ బరువున్న ఆభరణాలను ఎంచుకుంటూ, ప్రయాణాలు, వినోదం వంటి వాటిపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. 2026 తొలి రెండు నెలల్లోనే బంగారం ధరలు 11 సార్లు కొత్త గరిష్ఠాలను నమోదు చేయడం కూడా మార్కెట్లో దాని ప్రాధాన్యాన్ని చూపిస్తోంది.