భారత్‌ను ‘స్పేస్ పవర్’గా మార్చిన 8 చారిత్రాత్మక మిషన్లు ఇవే..!
- 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట ప్రయోగం
- ఇన్‌శాట్‌తో టీవీ, సమాచార సేవలకు ఊతం
- పీఎస్ఎల్వీతో పెరిగిన భారత్ ప్రయోగ సామర్థ్యం
- చంద్రయాన్-1తో చంద్రుడిపై నీటి ఆనవాళ్లకు ఆధారాలు
- మంగళయాన్‌తో అంగారకుడి కక్ష్యలోకి భారత్
- ఆదిత్య ఎల్1తో సూర్యుడిపై పరిశోధనలు
‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ’ (ఇస్రో) ప్రయాణం ఎన్నో అద్భుత విజయాలతో సాగుతోంది. 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభటను ప్రయోగించిన భారత్.. ఇప్పుడు చంద్రుడిపై పరిశోధనలు, అంగారకుడి అన్వేషణ, సూర్యుడి అధ్యయనం చేసే స్థాయికి చేరింది. ఉపగ్రహ సాంకేతికతతో మొదలైన ఈ ప్రయాణం.. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అక్టోబర్ 4 నుంచి 10 వరకు ‘ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు’ జరుగుతున్న నేపథ్యంలో ఇస్రో సాధించిన ఎనిమిది కీలక మైలురాళ్లపై ఓ లుక్కేద్దాం.
1. ఆర్యభట: భారత అంతరిక్ష ప్రయాణానికి తొలి అడుగు
1975 ఏప్రిల్ 19న ఆర్యభట ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించింది. ఇస్రో రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్ సహకారంతో అంతరిక్షంలోకి పంపారు. ఎక్స్-రే ఖగోళ శాస్త్రం, సూర్యుడి అధ్యయనం, వాతావరణంపై పరిశోధనలకు ఇది ఉపయోగపడింది. భారత అంతరిక్ష పరిశోధనలకు ఇదే పునాది వేసింది.
2. ఇన్శాట్: ప్రజలకు చేరువైన అంతరిక్ష సాంకేతికత
ఇన్శాట్ ఉపగ్రహ వ్యవస్థ దేశంలో టెలికమ్యూనికేషన్లు, టీవీ ప్రసారాలు, వాతావరణ అంచనాలు, విద్యా కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడింది. అంతరిక్ష సాంకేతికతను సామాన్య ప్రజల అవసరాలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించింది.
3. పీఎస్ఎల్వీ: ఇస్రోకు నమ్మకమైన రాకెట్
‘పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్’ (పీఎస్ఎల్వీ) 1994లో తొలి విజయవంతమైన ప్రయోగం తర్వాత ఇస్రోకు ప్రధాన రాకెట్‌గా ఎదిగింది. భారత ఉపగ్రహాలతో పాటు విదేశీ ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. చంద్రయాన్-1, మంగళయాన్ ప్రయోగాల్లోనూ కీలక పాత్ర పోషించింది.
4. చంద్రయాన్-1: చంద్రుడిపై నీటి ఆనవాళ్లకు ఆధారాలు
2008 అక్టోబర్ 22న భారత్ తొలి చంద్రయాన్ ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో 11 శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలించిన ఈ మిషన్.. అక్కడ నీటి అణువులు, హైడ్రాక్సిల్ ఆనవాళ్లపై కీలక ఆధారాలను అందించింది. చంద్రుడిపై నీటి ఉనికిపై శాస్త్రవేత్తల అవగాహనను ఇది మార్చింది.
5. మంగళయాన్: అంగారకుడి కక్ష్యలోకి భారత్
2013లో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్.. మంగళయాన్గా ప్రసిద్ధి చెందింది. తొలి ప్రయత్నంలోనే అంగారకుడి కక్ష్యలోకి చేరిన భారత్.. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. అంగారకుడి ఉపరితలం, వాతావరణంపై అధ్యయనం చేయడంలో ఈ మిషన్ కీలకమైంది.
6. చంద్రయాన్-2: వైఫల్యంలోనూ విలువైన పరిశోధనలు
2019 జూలై 22న ప్రయోగించిన చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించలేకపోయినా.. ఆర్బిటర్ తన పరిశోధనలను కొనసాగించింది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించింది. ఈ అనుభవం తర్వాతి చంద్రయాన్-3 మిషన్‌కు ఉపయోగపడింది.
7. చంద్రయాన్-3: చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్
2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా దిగింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో ల్యాండర్, రోవర్ శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించాయి. ఈ విజయంతో ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థానం మరింత బలపడింది.
8. ఆదిత్య ఎల్1: సూర్యుడి రహస్యాలను తెలుసుకునే యత్నం
2023 సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్1ను ప్రయోగించింది. ఇది భారత్ చేపట్టిన తొలి అంతరిక్ష ఆధారిత సూర్యుడి పరిశీలన మిషన్. భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి సూర్యుడి వెలుపలి పొరలు, సౌర గాలులు, సౌర తుపాన్లను అధ్యయనం చేయడం దీని లక్ష్యం.
ఆర్యభటతో మొదలైన భారత అంతరిక్ష ప్రయాణం.. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్, సూర్యుడి అధ్యయనం వరకు విస్తరించింది. శాస్త్రీయ పరిశోధనలతో పాటు సమాచార వ్యవస్థలు, వాతావరణ అంచనాలు, అంతరిక్ష సాంకేతికతలో స్వావలంబన సాధించడంలో ఇస్రో కీలక పాత్ర పోషిస్తోంది.