భువనేశ్వర్ రీఎంట్రీ వెనుక అసలు కారణమిదే.. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్‌కు టీమిండియాలో చోటు
- పునరాగమనానికి అనుభవం, ఐపీఎల్ ప్రదర్శనే కారణమన్న బ్యాటింగ్ కోచ్
- యువ బౌలర్లతో పాటు అనుభవజ్ఞులూ అవసరమన్న సితాన్షు కోటక్
- షమీ ఎంపికపై సెలెక్టర్లదే తుది నిర్ణయమని స్పష్టీకరణ
- షమీ కూడా బాగా ఆడుతున్నాడని వ్యాఖ్య
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ భారత టీ20 జట్టులోకి వచ్చాడు. అతడి పునరాగమనానికి ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో పాటు అపార అనుభవం కూడా కారణమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించాడు. యువ బౌలర్లు బాగా రాణిస్తున్నప్పటికీ, కీలక సమయాల్లో అనుభవం కూడా అవసరమని అభిప్రాయపడ్డాడు.
భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన అతడు.. ఐపీఎల్లో మాత్రం తన సత్తా చాటాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ 2025 సీజన్లో 17 వికెట్లు, 2026 సీజన్లో 28 వికెట్లు పడగొట్టాడు. రెండు సీజన్లలో కలిపి 45 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ రెండు సీజన్లలో ఆర్సీబీ వరుసగా ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుంది.
ఇంగ్లండ్ పర్యటన సమయంలో జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం, యువ బౌలర్లు ఎక్కువగా ఉండటంతో అనుభవజ్ఞుల అవసరం కనిపించిందని కోటక్ చెప్పాడు. యువ ఆటగాళ్లు బాగా ఆడుతూ జట్టులోకి వస్తున్నారని, అయితే కొన్ని సందర్భాల్లో అనుభవానికి కూడా ప్రాధాన్యం ఉంటుందని వివరించాడు. ఐపీఎల్లో భువనేశ్వర్ నిలకడగా రాణించడం కూడా అతడి ఎంపికకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నాడు.
మరో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పునరాగమనంపై మాత్రం కోటక్ స్పష్టమైన వ్యాఖ్యలు చేయలేదు. షమీ కూడా మ్యాచ్‌లు ఆడుతూ బాగా రాణిస్తున్నాడని, అతడి ప్రదర్శనతో పాటు జట్టు అవసరాలను పరిగణనలోకి తీసుకుని సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు. తాను సెలెక్టర్‌ను కానందున షమీ ఎంపికపై తుది నిర్ణయం చెప్పలేనని స్పష్టం చేశాడు.
వీవీఎస్ లక్ష్మణ్‌ను సెలక్షన్ సమావేశాల్లో భాగం చేయడం, జట్టు యాజమాన్యం నుంచి సెలెక్టర్లకు ఆటగాళ్ల గాయాల సమాచారాన్ని చేరవేసే బాధ్యత అప్పగించారన్న వార్తలపైనా కోటక్ స్పందించాడు. ఈ విషయం తనకు కూడా మీడియా ద్వారానే తెలిసిందని చెప్పాడు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వెనుక సరైన కారణం ఉంటుందని భావిస్తున్నానని తెలిపాడు.