పదిహేనేళ్ల నరకం.. భరించలేకే భర్తను చంపేశా!
- ఒడిశాలో భర్తను హత్య చేసిన భార్య
- పదేళ్లుగా వేధిస్తున్నాడనే ఈ దారుణానికి పాల్పడ్డానని వెల్లడి
- నిద్రిస్తుండగా గొంతుపై కాలు పెట్టి చంపినట్లు అంగీకారం
- గతంలో ఫిర్యాదు చేసినా ప్రవర్తనలో మార్పు రాలేదని వాంగ్మూలం
- నిందితురాలిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సంవత్సరాల తరబడి భర్త నుంచి ఎదురవుతున్న గృహహింస, దాడులను ఇక భరించలేకపోయానని, అందుకే అతడిని అంతమొందించానని ఓ మహిళ పోలీసుల ఎదుట అంగీకరించింది. ఒడిశాలోని కేంద్రపడా జిల్లా మలపట్నా గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భర్త నిరంజన్ సాహు గొంతుపై కాలితో తొక్కి హత్య చేసినట్లు నిందితురాలు మనోరమ అంగీకరించింది.
నిరంజన్ రోజూ మద్యం తాగి వచ్చి భార్య, పిల్లలను కొట్టేవాడు. బుధవారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చి మనోరమతో పాటు పిల్లలతో గొడవపడి, ఆమెను తీవ్రంగా కొట్టి నిద్రపోయాడు. అనంతరం మనోరమ.. నిద్రిస్తున్న నిరంజన్ గొంతుపై కాలితో తొక్కి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు పోలీసులకు వివరించింది. గురువారం ఉదయం నిరంజన్ మృతదేహం ఇంటి బయట పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆలీ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, మనోరమ తన గోడును వెళ్లబోసుకుంది. గత 10 నుంచి 15 ఏళ్లుగా తన భర్త ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి తనను, ఇద్దరు పిల్లలను దారుణంగా కొట్టేవాడని తెలిపింది. తాను ఓ హోటల్లో గిన్నెలు కడిగి వచ్చే సంపాదనతోనే పిల్లలను పోషిస్తున్నానని చెప్పింది. గతంలో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, భర్త మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాడని, కానీ బెయిల్పై బయటకు వచ్చాక మళ్లీ తన హింసను కొనసాగించాడని వాపోయింది. బుధవారం రాత్రి కూడా తనను తీవ్రంగా కొట్టడంతో, ఇకపై ఈ నరకం భరించలేనని, ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతోనే ఈ హత్య చేశానని ఆమె అంగీకరించింది.
ఈ హత్యలో తన కుమారుడు, మైనర్ కుమార్తె కూడా తనకు సహాయం చేశారని మనోరమ చెప్పడం కేసులో మరో కీలక అంశంగా మారింది. అయితే, ఈ ఘటనలో వారి పాత్రపై పోలీసులు ఇంకా స్పష్టతకు రాలేదు. దీనిపై లోతైన విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మనోరమను అరెస్టు చేసిన పోలీసులు, సైంటిఫిక్ బృందం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నిరంజన్ మరణానికి కచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని అధికారులు తెలిపారు.