రజనీకాంత్ 'జైలర్ 2' సెన్సార్ పూర్తి.. ముత్తువేల్ పాండియన్ రీఎంట్రీకి అంతా సిద్ధం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ 'జైలర్ 2' సెన్సార్ పూర్తి.. ముత్తువేల్ పాండియన్ రీఎంట్రీకి అంతా సిద్ధం!

Rajinikanth Jailer 2 censor complete Muthuvel Pandian re-entry ready
  • సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రజినీకాంత్ 'జైలర్ 2'
  • సినిమాకు యూఏ 16+ సర్టిఫికెట్ జారీ చేసిన సీబీఎఫ్‌సీ
  • మొత్తం 165 నిమిషాల 18 సెకన్ల రన్‌టైమ్‌ ఖరారు
  • అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
  • భారీ అంచనాలతో వస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్ చిత్రం
సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జైలర్ 2' చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'యూ/ఏ 16+' సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా మొత్తం రన్‌టైమ్‌ను 165 నిమిషాల 18 సెకన్లుగా (2 గంటల 45 నిమిషాలు) ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

బ్లాక్‌బస్టర్ హిట్ 'జైలర్'కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదటి భాగాన్ని మించిన యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సీక్వెల్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. 'జైలర్'లో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ 'ముత్తువేల్ పాండియన్' పాత్రలో రజినీకాంత్ అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా, ఈ సీక్వెల్‌లో ఆయన పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈసారి తారాగణం కూడా మరింత భారీగా ఉంది. రజినీకాంత్‌తో పాటు ఎస్‌జే సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మొదటి భాగంలో అతిథి పాత్రల్లో మెరిసిన మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, మిథున్ చక్రవర్తి ఈ చిత్రంలోనూ కనిపించనుండటం విశేషం. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

గతేడాది వచ్చిన 'జైలర్' (రన్‌టైమ్ 168 నిమిషాలు) కంటే 'జైలర్ 2' నిడివి కొద్దిగా తక్కువగా ఉండటం గమనార్హం. యాక్షన్, హ్యూమర్, మాస్ మూమెంట్స్‌తో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, సెన్సార్ వివరాలు, రన్‌టైమ్‌పై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement
Rajinikanth
Jailer 2
Nelson Dilipkumar
Sun Pictures
Muthuvel Pandian
Jailer 2 Release Date

More Telugu News