'జైలర్ 2' .. వెయ్యికోట్ల మాట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జైలర్ 2' .. వెయ్యికోట్ల మాట!

Jailer 2 Movie Update
  • 600 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన 'జైలర్'
  • సీక్వెల్ గా రూపొందుతున్న 'జైలర్ 2'
  • దసరాకి బరిలోకి దిగుతున్న సినిమా 
  • వెయ్యికోట్లకి పైగా రాబట్టడం ఖాయమంటున్న ఫ్యాన్స్

రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి .. ఆయన సినిమాలకి గల మార్కెట్ ను గురించిగాని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒకానొక సందర్భంలో సీనియర్ దర్శకులతో మాత్రమే సినిమాలు చేస్తూ వెళ్లిన రజనీకాంత్, ఆ తరువాత యువ దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతూ వెళ్లారు. అందుకు నిదర్శనంగా తెరపైకి వచ్చిన సినిమాలే 'కబాలి' .. 'కాలా' .. 'జైలర్'. అప్పటివరకూ తెరపై కనిపిస్తూ వచ్చిన రజనీని లుక్ పరంగా కొత్తగా ఆవిష్కరించిన సినిమాలు ఇవి.

రజనీకాంత్ కెరియర్ లో సూపర్ హిట్లు .. బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉండొచ్చు. అయితే ఆ జాబితాలో ప్రత్యేకంగా కనిపించే సినిమాగా 'జైలర్' ను గురించి చెప్పుకోవచ్చు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. చాలా వేగంగా ఈ మార్కును అందుకున్న సినిమాగా ఇది నిలిచిపోయింది. రజనీ ఛరిష్మా ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. 

300 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా, వెయ్యికోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం ఖాయమనే మాట చాలా బలంగా వినిపిస్తోంది. మిథున్ చక్రవర్తి .. ఎస్ జె సూర్య .. విద్యాబాలన్ .. రమ్యకృష్ణ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు. అనిరుధ్ నేపథ్య సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దసరాకి ఈ సినిమా ఏ రేంజ్ లో సందడి చేస్తుందనేది చూడాలి మరి.

Advertisement
Rajinikanth
Jailer 2
Nelson Dilipkumar
Anirudh Ravichander
Jailer 2 Release Date
Jailer 2 Cast

More Telugu News