ఐఫోన్ కొనాలనుకునేవారికి యాపిల్ షాక్.. పాత మోడళ్ల ధరలు భారీగా పెంపు
- రూ.17,000 పెరిగిన ఐఫోన్ 17 ధర
- ఐఫోన్ 17ఈపై రూ.15,000 పెంపు
- ఐఫోన్ 16 ధర రూ.89,900
- ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ.30,000 పెంపు
- మెమరీ, ర్యామ్ కొరతే ధరల పెంపునకు కారణం
కొత్త ఐఫోన్లు వచ్చాయంటే పాత మోడళ్ల ధరలు తగ్గుతాయని ఆశిస్తాం. కానీ ఈసారి యాపిల్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఐఫోన్ 18 ప్రో సిరీస్ విడుదల తర్వాత భారత్‌లో పలు పాత ఐఫోన్ మోడళ్ల ధరలను పెంచింది. దీంతో డిస్కౌంట్ కోసం పాత ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురైంది.
స్టాండర్డ్ ఐఫోన్ 17 ధర భారీగా పెరిగింది. 256జీబీ మోడల్ ప్రారంభ ధర రూ.82,900గా ఉండగా.. ఇప్పుడు రూ.99,900కు చేరింది. అంటే ఏకంగా రూ.17,000 పెరిగింది. 512జీబీ మోడల్ ధర రూ.1,24,900కు చేరింది.
‘ఐఫోన్ 17ఈ’ ధర కూడా రూ.15,000 పెరిగింది. గతంలో రూ.64,900గా ఉన్న ఈ మోడల్ ఇప్పుడు రూ.79,900కు లభిస్తుంది. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.69,900గా ఉండగా.. ఇప్పుడు రూ.89,900కు పెరిగింది.
ఇక ఐఫోన్ ఎయిర్ ధర ఏకంగా రూ.30,000 పెరిగింది. రూ.1,19,900గా ఉన్న దీని ధర ఇప్పుడు రూ.1,49,900కు చేరింది. పాత మోడళ్లలో ఇదే అత్యధిక ధర పెంపు.
ఎందుకు పెరిగాయి?
కొత్త తరం ఐఫోన్లు వచ్చిన తర్వాత పాత మోడళ్ల ధరలను తగ్గించడం యాపిల్‌లో సాధారణంగా కనిపించే విధానం. అయితే ఈసారి ధరలు పెంచడానికి ప్రధాన కారణాల్లో మెమరీ, ర్యామ్ కొరత ఒకటిగా తెలుస్తోంది. కృత్రిమ మేధ ఆధారిత సేవలకు భారీగా డిమాండ్ పెరగడంతో ఏఐ సంస్థలు, డేటా సెంటర్లు పెద్ద మొత్తంలో మెమరీని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో సరఫరాపై ఒత్తిడి పెరిగి ధరలు కూడా పెరుగుతున్నాయి.
యాపిల్ గతంలో మ్యాక్బుక్లు, ఐప్యాడ్ల ధరలను కూడా పెంచింది. ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్లోనూ ధరల పెంపు కనిపిస్తోంది.