విడాకుల పిటిషన్‌ వెనక్కి తీసుకున్న సునీతా అహూజా.. ధ్రువీకరించిన గోవింద మేనేజర్‌

Sunita Ahuja withdraws divorce petition confirmed by Govinda manager
  • గతకొన్నేళ్లుగా స్టార్‌ కపుల్‌ గోవింద-సునీత మధ్య విభేదాలు
  • గోవింద నటి కొమల్‌ రాణితో కనిపించడంతో ముదిరిన వివాదం
  • 2024లోనే కోర్టు విడాకుల పిటిషన్‌ దాఖలు చేసిన సునీత
  • తాజాగా మరోసారి కోర్టుకు హాజరైన వైనం
  • పిటిషన్ వెనక్కి తీసుకున్నారని గోవింద మేనేజర్‌ శశి సిన్హా వెల్లడి
బాలీవుడ్‌ నటుడు గోవింద, ఆయన భార్య సునీతా అహూజా దాంపత్య జీవితంపై కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సునీతా అహూజా విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని గోవింద మేనేజర్‌ శశి సిన్హా ధ్రువీకరించారు.

బుధవారం ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు సునీత తన కుమారుడు యశ్‌వర్ధన్‌ అహూజాతో కలిసి వెళ్లారు. అనంతరం ఆమె కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు శశి సిన్హా తెలిపారు. ఈ నిర్ణయం సునీత స్వచ్ఛందంగా తీసుకున్నదేనని చెప్పారు.

ఇటీవల గోవిందకు ఓ యువ నటి కొమల్‌ రాణితో సంబంధం ఉందంటూ సునీతా అహూజా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. దీనిపై గోవింద సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేశాడు. మాట్లాడేటప్పుడు భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని సునీతకు సూచించాడు. తన వృత్తిపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కోరాడు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని సూచించాడు.

ఈ వ్యవహారంపై గోవింద మేనేజర్‌ స్పందిస్తూ.. విడాకుల పిటిషన్‌ను సునీతే దాఖలు చేశారని, ఇప్పుడు ఆమే వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఇది కుటుంబానికి సంబంధించిన విషయమని చెప్పారు. ఆమె మనసులో ఏం మార్పు వచ్చిందో తనకు తెలియదన్నారు.

గోవింద, సునీత, వారి పిల్లలు టీనా, యశ్‌వర్ధన్‌.. ఎవరూ విడాకులు కోరుకోలేదని శశి సిన్హా పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఈ వ్యవహారంపై రకరకాల కథనాలు రావడం బాధ కలిగించిందన్నారు. సునీత తీసుకున్న తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

గోవింద, సునీత 1987 మార్చిలో వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని కొంతకాలం రహస్యంగా ఉంచారు. 1988లో కుమార్తె టీనా జన్మించిన తర్వాత తమ వివాహం గురించి అధికారికంగా వెల్లడించారు.
Advertisement
Sunita Ahuja
Govinda
Divorce Petition Withdrawn
Bandra Family Court
Shashi Sinha
Bollywood Celebrity News

More Telugu News