జూనియర్ ఎన్టీఆర్ 'సీఎం' అంటూ.. అభిమానుల నినాదాలు

Jr NTR Fans Chant CM Slogans at Dragon Glimpse Screening
  • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డ్రాగన్'
  • పలు థియేటర్లలో ఈ సినిమా గ్లింప్స్ విడుదల కోసం స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు
  • బాలానగర్‌లోని విమల్ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ గ్లింప్స్ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా పలు థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయగా, బాలానగర్‌లోని విమల్ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణసంచా కాల్పులతో థియేటర్ ప్రాంగణమంతా ఒక మాస్ జాతరను తలపించింది. 


తమ అభిమాన హీరో స్క్రీన్ మీద కనిపించగానే ఫ్యాన్స్ చేసిన హంగామాతో థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఈ వేడుకల్లో ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు, అభిమానులు పెద్ద పెట్టున చేసిన “సీఎం.. సీఎం..” నినాదాలు ఇప్పుడు అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న తారక్, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. అయినప్పటికీ, ఆయన రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ అభిమానుల్లో ఎప్పటికప్పుడు వ్యక్తమవుతూనే ఉంది. 


ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమేననే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసిన 'సీఎం' నినాదాలు తారక్ రాజకీయ భవిష్యత్తుపై మళ్లీ ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి.

Go Back to Shorts
Jr NTR
NTR Dragon
Prashanth Neel
NTR fans
Telugu Desam Party
AP Politics
Telangana Politics
Tollywood
Vijay Tamil Nadu Politics
Balnagar Vimal Theater

More Telugu News